![]() |
![]() |

నవ్యస్వామి బుల్లితెర ఆడియన్స్ కి బాగా పరిచయమైన నటి. ఈమె "నా పేరు మీనాక్షి, ఆమె కథ" సీరియల్స్ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. కన్నడ నటి ఐనా కూడా తెలుగు బుల్లితెర మీద మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె బుల్లితెర నటుడు రవికృష్ణతో కలిసి "ఆమె కథ" సీరియల్ లో నటించింది. ఇక ఈ సీరియల్ లో వీళ్ళ జోడి మంచి పెయిర్ గా పేరు తెచ్చుకునేసరికి వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి.
ఐతే ఈ వార్తలను వాళ్ళు ఖండించారు. తాము లవర్స్ కాదు అని కేవలం ఫ్రెండ్స్ అని చెప్పారు. ఐతే కొన్ని నెలల క్రితం వరకు ఈ స్క్రీన్ జంట అన్ని షోస్ లో, ఈవెంట్స్ లో తెగ హడావిడి చేశారు కానీ తర్వాత ఇద్దరూ కలిసి ఎక్కడా కనిపించడం లేదు. రీసెంట్ గా నవ్యస్వామి "ఇంటింటి రామాయణం" మూవీలో నటించింది. ఇక ఇప్పుడు నవ్యస్వామి ఇయర్ ఎండింగ్ లో కొత్త కార్ కొనుక్కుంది. మెర్సిడెస్ బెంజ్ కారును కొని కార్ ముందు ఫోటో దిగి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది..ఈ స్టేటస్ చూసిన మరో బుల్లితెర నటి నవ్యస్వామి ఫ్రెండ్ "కస్తూరి" సీరియల్ ఫేమ్ ఐశ్వర్య పిస్సే "కంగ్రాట్యులేషన్స్ ఫర్ యువర్ న్యూ కార్" అని విషెస్ చెప్పింది.."నీ శ్రమ, పట్టుదలే ఈరోజు నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి" అని అంది. తన ఫ్రెండ్ ఇచ్చిన కామెంట్ కి నవ్య స్వామి " థాంక్స్ బేబీ" అని రిప్లై ఇచ్చింది. ఈ ఏడాది చాలా మంది బుల్లితెర నటీనటులు కొత్త కార్లు కొనుక్కున్నారు. కొత్త ఇళ్లల్లోకి గృహప్రవేశాలు కూడా చేసుకున్నారు. ఇప్పుడు నవ్యస్వామి కూడా ఒక కార్ కొనుక్కుంది.
![]() |
![]() |